క‌రోనా: ‌వైద్యుల‌నే ప‌ట్టించుకోక‌పోతే ఎలా?

రాయ్‌బ‌రేలీ : త‌మ ప్రాణాల‌కు తెగించి క‌రోనా బాధితుల‌కు చికిత్స‌నందిస్తున్న వైద్యుల‌కు స‌రైన స‌దుపాయాలు క‌ల్పించ‌క‌పోతే వారు చేస్తున్న కృషి వ్య‌ర్థ‌వమ‌వుతుంది. ఒక‌వైపు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వైద్యుల‌కు త‌గిన భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నామ‌ని గొప్ప‌లు చెబుతున్నారే త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో అది క‌నిపించ‌డం లేద‌నే చెప్పాలి. తాజాగా ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీలో కోవిడ్‌-19 బాధితుల‌కు చికిత్సనందిస్తున్న వైద్యులు రిలీజ్ చేసిన వీడియో ఒకటి ఆలోచ‌న‌లో ప‌డేసింది. అంతేగాక తాము వైద్యుల‌మ‌న్న సంగ‌తి మ‌రిచి క‌నీస సౌక‌ర్యాలను ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంపై అక్క‌డి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌కు లేఖ ద్వారా త‌మ బాధ‌ను చెప్పుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. రాయ్‌బ‌రేలీలో క‌రోనా సోకిన బాధితుల‌కు అక్క‌డి ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో వైద్యులు ఇంటికి వెళ్ల‌డానికి నిరాక‌రించ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఆసుప‌త్రి ప‌క్క‌నే ఉన్న ఒక గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్‌లో వారు ఉండేదుకు క్వార్ట‌ర్స్‌ను ఏర్పాటు చేశారు. (ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు)