అమరావతి : సీఆర్‌డీఏ పరిధిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణ విషయంలో అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఆర్‌డీఏపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఆర్‌డీఏ కమిషనర్ లక్ష్మినరసింహం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు.
‘ఆర్భాటాలకు పోకుండా నిర్మాణాలు చేపట్టాలి’